A bench comprising justices Ashok Bhushan and K M Joseph said the disciplinary committee of the Board of Control for Cricket in India (BCCI) may reconsider within three months the quantum of punishment to be given to Sreesanth. The bench made it clear that Sreesanth will get the opportunity of being heard by the committee on the quantum of the punishment.
#supremecourt
#sreesanth
#bcci
#spotfixing
#ashokbhushan
#kmjoseph
#ankithchavan
#ajithchandila
#kursheedh
#kerala
#rajasthanroyals
స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం శ్రీశాంత్ వాదనలు విన్న జస్టిస్ అశోక్‌భూషణ్, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా ధర్మాసనం అభివర్ణించింది.స్పాట్ ఫిక్సింగ్ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. శ్రీశాంత్ తరఫున ప్రముఖ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ శుక్రవారం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. "కచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్‌పై నిషేధం విధించడం దారుణం" అని అన్నారు.